Jhanma Bhoomi Sri Rayaprolu subbarao (1892)

 





జన్మ భూమి

శ్రి రాయ ప్రొలు సుబ్బరావు (1892) 
rayaprolusubarao

యే దేశ మేగినా, యెందుగాలిడిన
యే పీఠ మెక్కినా, యెవ్వరెదు రైన
పొగడరా, నీ తల్లి భూమి భారతిని
నిలుపరా, నీ జాతి నిండు గర్వమ్ము
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరు లింకెందు-

యే పూర్వపుణ్యమో, యే యోగబలమొ,
జనీంచినాడ వీస్వర్గలోకమున
యే మంచిపూవులన్ బ్రేమించినావొ
నిను మోచె, నీ తల్లి కనకగర్భమున
సూర్యుని వెలుతురు సోకునందాక
ఓడలజెండాలు ఆడునందాక
నరుడు ప్రాణాలతో నడచునందాక
అందాక గల ఈ యనంతభూతలిని
మనభూమి వంటి కమ్మని భూమిలేదు-

తమ తపస్సులు ౠషుల్ ధారబోయంగ
చండవీర్యము శూరచంద్రులర్పింప,
రాగదుగ్ధము భక్తరాజు లీయంగ
భావసూత్రము కవిభంధవు లల్ల,
దిక్కుల కెగదన్ను తేజంబు వెలుగ
జగముల నూగించు మగతనంబెగయ,
రాలు పూవులు సేయు రాగాలు సాగ
సౌందర్య మెగబోయు సాహిత్య మొప్ప-

వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్యదేశంబు పుత్ర;
అవమాన మేలరా, అనుమాన మేల
భరతపుత్రుడ నంచు భక్తితో బలుక-

yE dESa mEginA, yendugAliDina
yE pITha mekkinA, yevvaredu raina
pogaDarA, nI talli bhoomi bhAratini
niluparA, nI jAti ninDu garvammu
lEdurA iTuvanTi BoodEvi yendu
lErurA manavanTi pouru linkendu-

yE poorvapuNyamO, yE yOgabalamo,
janiincinADa vIsvargalOkamuna
yE mancipoovulan brEmincinAvo
ninu mOce, nI talli kanakagarBamuna
sooryuni veluturu sOkunandAka
ODalajenDAlu ADunandAka
naruDu prANAlatO naDacunandAka
andAka gala I yanantaBootalini
manaBoomi vanTi kammani BoomilEdu-

tama tapassulu RuShul dhArabOyanga
canDavIryamu Sooracandrularpimpa,
rAgadugdhamu BaktarAju lIyanga
BAvasootramu kaviBandhavu lalla,
dikkula kegadannu tEjambu veluga
jagamula noogincu magatanambegaya,
rAlu poovulu sEyu rAgAlu sAga
soundarya megabOyu sAhitya moppa-

veligina dI divya viSvambu putra
dIpince nI puNyadESambu putra;
avamAna mElarA, anumAna mEla
BarataputruDa nancu BaktitO baluka-

Comments