kaanksha- Sree vedula satyanarayana

 

శ్రీ వేదుల సత్యనారాయణ

vedula

కాంక్ష
********

ఈ సుమజన్మ మెట్లొ ఘటియిల్లెను నా
కొకనాటిపాటిదై, వాసన లీను సోయగము
పాయని తీయని పోడుముల్ క్షణంబో, సగమో
విచారపడబో, నైనన్ విడివడ్డ నాయెదన్
మోసులువారు నూతన మనోరధ,
మామనివేడి పొంగులన్.

పేదలరక్తమాసముల పెంపు వహించి
దయారసామ్రుతాస్వాద దరిద్రులైన ధనవంతుల
పెద్దరికమ్ముకై, మతోన్మాదము పెంచు దేవునికి
మారుగ నిల్చిన రాతిబొమ్మలం దూదరవోవు
పాడుబ్రదు, కొక్కనిమేషము సైప నాయెదన్.

నాకు తలంపు లేదు లలనాజనతా కబరీభరైక
భూషాకలనన్, సతీ మ్రుదుభుజాంతరతల్ప
కుచోపగూహ బిబ్బోకమునన్, వధూజన
కపోలగళఛ్ఛ్రవణా వసంత హేవాకమునన్
విలాసినుల పాపట చందురుకావిపూతలన్.

కానుకనై ధరాధిపుల కాళ్ళకడం
బొరలాడి వాడిపోలేను, ధరాపరాగపటలీ
మలిన్మగు ద్వారతోరణా స్థానమునం
దురింబడగజాలను, దోసిటపేరి ఘోర కారా
నరకమ్మునం దుసురు రాల్పగలేను నిమేషరక్తికై.

టేనెలకోసమై కొదమతేటులదాటు లొనర్చు
న్రుత్యగీతానునయమ్ముగాని, మలయానిలుకౌగిట
బుల్కరించు సౌఖ్యానుభవమ్ముగాని
తరుణారుణరాగకదుష్ణుచుంబన శ్రీ
నవకమ్ముగాని, పరిత్రుప్తి యొసంగదు
నాకొకింతయున్.

నీచదాస్యవ్రుత్తి మననేరని శూరత
మాత్రుదేశ సేవాచరణమ్మునం
దసువు లర్పణ సేసినవారి పార్ధివశ్రీ
చెలువారుచోట, తదస్రుగ్రుచులన్ వికసించి,
వాసనల్ వీచుచు రాలిపోవగవలెం
తదుడ్త్త సమాధి మ్రుతికన్.-------

kaanksha

Sree vEdula satyanaaraayaNa

kaanksha
********

ii sumajanma meTlo GaTiyillenu na'
kokana'Tipa'Tidai, va'sana liinu sOyagamu
pa'yani tiiyani pODumul kshaNambO, sagamO
vica'rapaDabO, nainan viDivaDDa na'yedan
mOsuluva'ru nootana manOradha,
ma'manivEDi pongulan.

pEdalaraktama'samula pempu vahinci
daya'rasa'mruta'sva'da daridrulaina dhanavantula
peddarikammukai, matOnma'damu pencu dEvuniki
ma'ruga nilcina ra'tibommalam doodaravOvu
pa'Dubradu, kokkanimEshamu saipa na'yedan.

na'ku talampu lEdu lalana'janata' kabariiBaraika
Boosha'kalanan, satii mruduBuja'mtaratalpa
kucOpagooha bibbOkamunan, vadhoojana
kapOlagaLaCCravaNa' vasamta hEva'kamunan
vila'sinula pa'paTa canduruka'vipootalan.

ka'nukanai dhara'dhipula ka'LLakaDam
borala'Di va'DipOlEnu, dhara'para'gapaTalii
malinmagu dva'ratOraNa' stha'namunam
durimbaDagaja'lanu, dOsiTapEri GOra ka'ra'
narakammunam dusuru ra'lpagalEnu nimEsharaktikai.

TEnelakOsamai kodamatETulada'Tu lonarcu
nrutyagiita'nunayammuga'ni, malaya'nilukougiTa
bulkarincu souKya'nuBavammuga'ni
taruNa'ruNara'gakadushNucumbana Srii
navakammuga'ni, paritrupti yosamgadu
na'kokintayun.

niicada'syavrutti mananErani Soorata
ma'trudESa sEva'caraNammunam
dasuvu larpaNa sEsinava'ri pa'rdhivaSrii
celuva'rucOTa, tadasrugruculan vikasinci,
va'sanal viicucu ra'lipOvagavalem
tadud'tta sama'dhi mrutikan.-------

Comments