భారత స్వాతంత్ర్యోద్యమ సందర్భంలో గాంధిగారి ముద్ర అన్ని దేశభాష సాహిత్యాలమీద పడినది. ఆ రోజులలో గాంధిగారి మూర్తిని ప్రజలకు సాక్షాత్కరింపజేసిన గేయమిది. భావకవులలో ప్రముఖులైన బసవరాజు అప్పారావు గేయ రచనలలో నిపుణులు. ఈ గేయము ఆబాల గోపాలాన్ని ఆకర్షించినది. కొల్లై గట్టితే నేమీ మాగాంధి కోమటై పుట్టితే నేమీ? ||కొల్లై|| వెన్న పూసా మనసు కన్నతల్లి ప్రేమ పండంటిమోముపై బ్రహ్మ తేజస్సు ||కొల్లై|| నాల్గుపరకల పిలక నాట్యమాడే పిలక నాలుగూవేదాల నాణ్యమెరిగిన పిలక ||కొల్లై|| బోసినోర్విప్పితే ముత్యాల తొలకరే చిరునవ్వు నవ్వితే వరహాల వర్షమే ||కొల్లై|| చకచక నడిస్తేను జగతి కంపించేను పలుకు పలికీతేను బ్రహ్మవక్కేను ||కొల్లై|| కౌశికుడు క్షత్రియుడు కాలేద బ్రహ్మౠషి నేడు కోమటి బిడ్డ కూడ బ్రహ్మర్షియె ||కొల్లై|| -----బసవరాజు అప్పారావుగారు |
Comments
Post a Comment